Pakistan rubbishes tabloid s olympic visa scam claims

Pakistan rubbishes tabloid’s Olympic visa scam claims,pakistani, sports, officials, monday, rubbished, claims, a, british, newspaper, uncovered, visa, scam, allowed, potential, terrorists, olympic, village, sun, tabloid, busted, racket, involving, politician, lahore, access, london, games,

Pakistan rubbishes tabloid’s Olympic visa scam claims

Pakistan01.gif

Posted: 07/24/2012 01:01 PM IST
Pakistan rubbishes tabloid s olympic visa scam claims

Pakistan rubbishes tabloid’s Olympic visa scam claims

పాకిస్తాన్ ఒలింపిక్ జట్టు మాటున ఉగ్రవాదులు లండన్ వచ్చే ప్రమాదముందని ఓ బ్రిటిష్ టాబ్లాయిడ్ హెచ్చరించింది. ఒలింపిక్స్ సందర్భంగా పాక్‌లో వీసా స్కామ్ చోటుచేసుకుందని వెల్లడించింది. పాక్ జట్టు 'బోగస్ సహా యక సిబ్బంది' కింద తప్పుడు పాస్‌పోర్ట్‌లు, వీసాలు ఇప్పించేందుకు ఓ ముఠా రంగంలోకి దిగిందని ఈ టాబ్లాయిడ్ తెలిపింది. దీనివల్ల ఉగ్రవాదులు మారు పేర్లతో పాస్ట్‌పోర్ట్, వీసా లు పొంది సునాయాసంగా ఇంగ్లండ్ చేరుకోవచ్చని 'ది సన్' ఆందోళన వ్యక్తం చేసింది. వీసా స్కామ్‌లో పాక్‌కు చెందిన ఓ రాజకీయ నాయకుడు, అధికారుల ప్రమేయముందని శూలశోధనలో తేలినట్టు పేర్కొంది. ఈ స్కామ్‌లో లాహోర్ కేంద్రంగా పనిచేసే డ్రీమ్ లాండ్ ట్రావెల్ ఏజన్సీ, అబిద్ చౌదరి అనే రాజకీయ నాయకుడు భాగస్వాములని వెల్లడించింది. 'శూలశోధనలో పాల్గొన్న మా విలేకరికి ఈ ముఠా మారు పేరుతో పాక్ పాస్‌పోర్టును సమకూర్చింది. రెండుమాసాలు ఉండేలా వీసా పొందేందుకు అబిద్ చౌదరి అతని నుంచి పది లక్షల రూపాయలను (పాక్ కరెన్సీ) లంచంగా తీసుకున్నాడు. పాక్ జట్టులో భాగంగా అతణ్ని లండన్‌కు పంపాడు. మా విలేఖరి శుక్రవారం జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా పాల్గొనొచ్చు' అని ది సన్ పేర్కొంది. మారు పేరుతో ఎలా వీసా పొందవచ్చో వివరిస్తూ అబిద్ చౌదరి మాట్లాడిన దృశ్యాన్ని రహస్యంగా చిత్రీకరించారు.

Pakistan rubbishes tabloid’s Olympic visa scam claims

విచారణకు పాక్ ఆదేశం: వీసా స్కామ్ గురించి బ్రిటీష్ టాబ్లాయిడ్ గుట్టురట్టు చేయడంపై పాకిస్తాన్ ప్ర భుత్వం స్పందించింది. ఈ సంఘటనపై విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సోమవారం నియమించింది. మూడ్రోజుల్లో దర్యాప్తు చేసి బాధ్యులను అరెస్ట్ చేయాల్సిందిగా ప్రధాని అంతర్గత వ్యవహరాల భద్రత సలహాదారు రెహ్మాన్ మాలిక్ ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ttd employees taken into custody by vigilance officers
17 children killed22 injured as school bus overturns  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles